రద్దయిన పాలసీల పునరుద్ధరణ

ABN , First Publish Date - 2020-08-10T05:51:12+05:30 IST

ఏదైనా కారణాలతో ప్రీమియం చెల్లించలేక మధ్యలో రద్దయిన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణకు అవకాశం కల్పిస్తున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ప్రకటించింది...

రద్దయిన పాలసీల పునరుద్ధరణ

  • అక్టోబరు 9 వరకు అవకాశం : ఎల్‌ఐసీ 


న్యూఢిల్లీ: ఏదైనా కారణాలతో ప్రీమియం చెల్లించలేక మధ్యలో రద్దయిన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణకు అవకాశం కల్పిస్తున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ప్రకటించింది.   ఈ నెల 10 నుంచి అక్టోబరు 9 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపింది. టర్మ్‌ పాలసీలు, ఇతర హై రిస్క్‌ పాలసీలు మినహా మిగతా అన్ని పాలసీలను లేటు ఫీజుతో పునరుద్దరించుకోవచ్చని పేర్కొంది. లేటు ఫీజు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల మధ్య ఉంటే 20 నుంచి 25 శాతం రాయితీ కూడా లభిస్తుందని తెలిపింది. ఈ పాలసీల పునరుద్దరణ కోసం ఎల్‌ఐసీ ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపడుతోంది.

Updated Date - 2020-08-10T05:51:12+05:30 IST