మొహర్రం పండుగ ఏర్పాట్లుపై మంత్రుల సమీక్ష

ABN , First Publish Date - 2020-08-12T01:18:04+05:30 IST

మొహర్రం పండుగ ఏర్పాట్లపై మంగళవారం రాష్ట్ర మంత్రులు సమీక్ష జరిపారు. ఈ నెలాఖరులో వస్తున్న మొహర్రం పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ

మొహర్రం పండుగ ఏర్పాట్లుపై మంత్రుల సమీక్ష

హైదరాబాద్: మొహర్రం పండుగ ఏర్పాట్లపై మంగళవారం రాష్ట్ర మంత్రులు సమీక్ష జరిపారు. ఈ నెలాఖరులో వస్తున్న మొహర్రం పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీలు చర్చించారు. కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా కోవిడ్ - 19 నిబంధనలు పాటిస్తూ పండగ జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అహ్మద్ భాషా ఖాద్రి, మైనారిటీ శాఖ సలహాదారు ఏకే ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం, జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, మైనారిటీ సంక్షేమ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-12T01:18:04+05:30 IST