రేవంత్‌రెడ్డి పిల్‌పై విచారణ అవసరం లేదు: హైకోర్టు

ABN , First Publish Date - 2021-08-04T21:13:24+05:30 IST

రేవంత్‌రెడ్డి పిల్‌పై విచారణ అవసరం లేదు: హైకోర్టు

రేవంత్‌రెడ్డి పిల్‌పై విచారణ అవసరం లేదు: హైకోర్టు

హైదరాబాద్: బేవరేజెస్ సంస్థలకు నీరు కేటాయించ వద్దన్న రేవంత్‌రెడ్డి పిల్‌పై విచారణ అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. కూల్ డ్రింక్‌ల తయారీ కోసం నీళ్లు విడుదల చేయవద్దని 2016లో రేవంత్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. తాగు, సాగు నీటి కొరత ఉన్నందున బేవరేజెస్ కు నీరు విడుదల చేయవద్దని పిల్‌లో రేవంత్‌రెడ్డి కోరారు. జాతీయ జల విధానం ప్రకారం పరిశ్రమలకు 10 శాతం నీరు కేటాయించొచ్చని ప్రభుత్వం పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయినందున రాష్ట్రంలో ప్రస్తుతం నీటి కొరత లేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. పరిశ్రమలకు నీటి కేటాయింపులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిందని జలమండలి పేర్కొంది. నాలుగేళ్ళలో పరిస్థితి మారినందున పిల్ పై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు సూచించింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరవు పరిస్థితులు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. సీడబ్ల్యూసీ, జాతీయ జల విధానానికి అనుగుణంగానే పరిశ్రమలకు నీరు కేటాయించాలని హైకోర్టు తెలిపింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిల్ పై కోర్టు విచారణ ముగించింది.

Updated Date - 2021-08-04T21:13:24+05:30 IST