Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 13 Aug 2022 10:35:01 IST

Revanth Apology: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ బహిరంగ క్షమాపణ

twitter-iconwatsapp-iconfb-icon
Revanth Apology: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ బహిరంగ క్షమాపణ

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkat reddy)కి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) బహిరంగ క్షమాపణ చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ (Addanki dayakar) బహిరంగంగా తిట్టడంపై బాధ్యత వహిస్తూ ఎంపీకి రేవంత్ క్షమాపణ చెప్పారు.  ట్విట్టర్‌లో క్షమాపణ వీడియోను రేవంత్ పోస్ట్ చేశారు.  ఇలాంటి భాష... ఎవరికీ మంచిది కాదని, దీనిని మరోసారి క్రమశిక్షణ కమిటీ పరిశీలించాలని చిన్నారెడ్డికి టీపీసీసీ చీఫ్ సూచించారు.



వీడియోలో ఏముందంటే...
రేవంత్ మాట్లాడుతూ... ‘‘మునుగోడు బహిరంగ సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్... మునుగోడు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి పరుషమైన పదజాలం వాడటంతో వారంతో మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా సారీ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెబుతున్నా. ఇలాంటి చర్యలు, ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాషీలక పాత్ర పోషించి, రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇలా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదని, తదుపరి చర్యల కోసం క్రమశిక్షణా సంఘం చైర్మన్ చెన్నారెడ్డికి రేవంత్ సూచిస్తూ’’ రేవంత్ ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేశారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.