భారీగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం

ABN , First Publish Date - 2022-04-13T01:09:31+05:30 IST

ముంబై : భగ్గుమంటున్న ఇంధన, ఆహార పదార్థాల ధరల ప్రభావంతో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది.

భారీగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం

ముంబై : భగ్గుమంటున్న ఇంధన, ఆహార పదార్థాల ధరల ప్రభావంతో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. మార్చి నెలలో 6.95 శాతానికి ఎగబాకింది. అంతక్రితం నెల ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.07 శాతంగా ఉందని నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్(ఎన్ ఎస్ వో) ప్రచురించిన గణాంకాలు స్పష్టం చేశాయి. ఆహార పదార్థాల ధరల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. మార్చి నెల రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలలో వంట నూనె(18.79 శాతం), కూరగాయలు(11.64 శాతం), మాంసం, చేపలు(9.63 శాతం), పాదరక్షలు, దుస్తులు(9.4 శాతం), ఇంధనం(7.52 శాతం) ప్రధాన కారణమయ్యాయి. కాగా వరుసగా మూడవ నెలలో కూడా రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ పరిధి మించి నమోదయ్యింది.


ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి 1.7 శాతం వృద్ధి

ఫిబ్రవరి నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) డేటాను ఎన్ఎస్ వో మంగళవారం విడుదల చేసింది. వార్షికపరంగా ఫిబ్రవరిలో 1.7 శాతం మేర వృద్ధి చెందింది. అయితే అంతక్రితం నెల జనవరితో పోల్చితే 4.7 శాతం మేర తగ్గుదల నమోదయ్యింది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ అంత దృఢంగా లేదని సంకేతాలు వెలువడినట్టు భావించాలని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. 

Updated Date - 2022-04-13T01:09:31+05:30 IST