నిరోధం 11500

ABN , First Publish Date - 2020-09-14T06:01:42+05:30 IST

నిఫ్టీ గత వారం కరెక్షన్‌లో పడి 11200 వరకు దిగజారినా బలమైన పునరుజ్జీవం సాధించి చివరికి 130

నిరోధం 11500

నిఫ్టీ గత వారం కరెక్షన్‌లో పడి 11200 వరకు దిగజారినా బలమైన పునరుజ్జీవం సాధించి చివరికి 130 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ స్థాయిలో ముగిసింది. ప్రస్తుతం స్వల్పకాలిక నిరోధం 11500 చేరువవుతోంది. గత వారం ఎలాంటి కన్సాలిడేషన్‌ లేకుండా ‘వి’ షేప్‌ రికవరీ సాధించింది. ప్రస్తుతం కన్సాలిడేట్‌ కావలసి ఉంది. ప్రధాన ట్రెండ్‌ పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ బలమైన పునరుజ్జీవం కారణంగా రియాక్షన్‌ కూడా ఏర్పడవచ్చు. తదుపరి స్వల్పకాలిక దిశ తీసుకునేందుకు 11500 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ స్థితిలో ఉన్నందు వల్ల స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. 


బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమించాలంటే 11500 వద్ద బ్రేకౌట్‌ సాధించాలి. మరో ప్రధాన నిరోధం 11600. ఆ పైన స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ ఏర్పడవచ్చు. ఆ పైన టార్గెట్‌ 11800. 


బేరిష్‌ స్థాయిలు: కరెక్షన్‌లో పడినా ప్రస్తుత ట్రెండ్‌లో భద్రత కోసం ప్రధాన మద్దతు స్థాయి 11300 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 11000.


బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఏర్పడిన బలమైన రియాక్షన్‌లో ఈ సూచీ 2200 వద్దకు దిగజారింది. గత రెండు వారాల్లో 3000 పాయింట్ల మేరకు కరెక్షన్‌ ఏర్పడి 50 డిఎంఏ వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం ఇక్కడ కన్సాలిడేట్‌ కావడం తప్పనిసరి. ప్రధాన నిరోధం 22700. ఆ పైన నిలదొక్కుకుంటే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ ఏర్పడుతుంది. 22000 వద్ద విఫలమైతే స్వల్పకాలిక డౌన్‌ట్రెండ్‌ తప్పదు. 

పాటర్న్‌: మరింత అప్‌ట్రెండ్‌ కోసం 11500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద బ్రేకౌట్‌ తప్పనిసరి. 11000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద ప్రధాన మద్దతు ఉంది. కాని ఇది దూరంగా ఉన్నందు వల్ల తక్షణ ముప్పు లేదు. 10, 20 డిఎంఏల వద్ద పరీక్ష ఎదురు కానుంది. 

టైమ్‌: ఈ సూచీ ప్రకారం తదుపరి రివర్సల్‌ మంగళవారం ఉంది. 


 అమర రాజా బ్యాటరీస్‌ (రూ.747) కొనుగోలు స్థాయిలకు చేరువలో..

రూ.740 ఎగువన కొనుగోలు మొదటి నిరోధం రూ.770 రెండో నిరోధం రూ.800

రూ.720 దిగువన డౌన్‌ట్రెండ్‌ మొదటి మద్దతు రూ.695 రెండో మద్దతు రూ.670


సోమవారం  స్థాయిలు


నిరోధం : 11510, 11560  

మద్దతు : 11400, 11345


Updated Date - 2020-09-14T06:01:42+05:30 IST