గెస్ట్‌ లెక్చరర్లపై ‘రెన్యువల్‌’ పిడుగు!

ABN , First Publish Date - 2022-08-10T09:45:05+05:30 IST

అరకొర జీతాలతో నెగ్గుకొస్తున్న గెస్ట్‌ లెక్చరర్ల నెత్తిన ఇప్పుడు రెన్యువల్‌ పేరిట మరో పిడుగు పడింది.

గెస్ట్‌ లెక్చరర్లపై ‘రెన్యువల్‌’ పిడుగు!

పెండింగ్‌లో ఐదునెలల జీతం

వేతనాల్లేక అధ్యాపకుల ఇక్కట్లు


హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): అరకొర జీతాలతో నెగ్గుకొస్తున్న గెస్ట్‌ లెక్చరర్ల నెత్తిన ఇప్పుడు రెన్యువల్‌ పేరిట మరో పిడుగు పడింది. గత విద్యాసంవత్సరానికి సంబంధించిన మూడు నెలల జీతాలతో పాటు, ఈ ఏడా ది రెండు నెలల జీతం కలిపి మొత్తం ఐదు నెలలు జీతా లు వారికి రావాల్సి ఉంది. దానికి తోడుగా తాజా రెన్యువల్‌ సమస్య తోడవడంతో ఈ జీతాల చెల్లింపు మరింత జాప్యం అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్స రం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. గెస్ట్‌ లెక్చరర్లను అధికారులు ఇంకా రెన్యువల్‌ చేయలేదు. సర్వీసు రెన్యువల్‌ కాకపోవడంతో జీతాలను చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ బోర్డు పరిధిలో సు మారు 1800 మంది, డిగ్రీ కాలేజీల్లో 1500 మంది గెస్ట్‌ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఒక్కో క్లాసుకు రూ. 390 చొప్పున నెలలో గరిష్ఠగా 72 క్లాసులకు మించకుం డా చెల్లిస్తున్నారు. నెలంతా పాఠాలు చెప్పినా... వీరికి వ చ్చే జీతం రూ. 28,080 మాత్రమే. ఆ జీతం చెల్లింపులో నూ వారికి ఆలస్యం జరుగుతోంది. గత ఆలస్యానికి ఆర్థిక సమస్యలు కారణం కాగా.. ఈ ఏడాది రెన్యువల్‌ సమస్య తలెత్తింది. కారణం ఏదైనా.. సమయానికి జీతం అందక లెక్చరర్లు మాత్రం ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.


గెస్ట్‌ లెక్చరర్లు గడచిన తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నారు. వారిని ప్రతి ఏటా రెన్యువల్‌ చేయాల్సి ఉంటుంది. ఈ విద్యాసంవత్సరంలో గెస్ట్‌ లెక్చరర్లను తీసుకోవడంపై అనుమతి కోరుతూ ఈ ఏడాది మే నెలలో ఇంటర్మీడియట్‌ విద్య కమిషనర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ఆర్థిక శాఖ ఆమోదించింది. అయితే.. వాటిలో ‘యూనిట్‌ వైజ్‌ సర్వీస్‌ డిటైల్స్‌’ లేకపోవడంతో గెస్ట్‌ లెక్చరర్ల వివరాలను మరోమారు పంపాలని ఉన్నత విద్యాశా ఖ అధికారులు గత నెల 2న మెమో జారీ చేశారు. అది జారీ అయి నెలన్నర దాటుతున్నా ఇంతవరకు ఆ వివరా లు ఉన్నత విద్యాశాఖకు వెళ్లలేదు.  

రెండు రోజుల్లో పరిష్కరించకుంటే ముట్టడి

రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల గెస్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ మంగళవారం సమావేశంలో నిర్ణయించింది. విద్యాసంవత్సరం జూన్‌ 15 నుంచే ప్రారంభమైనా గెస్టు లెక్చరర్ల .రెన్యువల్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు విద్యాశాఖ కార్యదర్శి,  ఇంటర్‌ కమిషనర్‌లను కలిసినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా గెస్ట్‌ లెక్చరర్లు కళాశాలలకు హాజరై విధులు నిర్వహిస్తున్నారని, వారి కొనసాగింపు విషయంలో మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కమిటీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.

Updated Date - 2022-08-10T09:45:05+05:30 IST