‘గ్యాప్ ఇంక్’తో Reliance భాగస్వామ్యం

ABN , First Publish Date - 2022-07-07T02:35:10+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్... భారతీయ అవుట్‌లెట్‌లలో తన ఉత్పత్తులను పంపిణీ చేయడానికి అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్ ‘గ్యాప్ ఇంక్’తో దీర్ఘకాలిక భాగస్వామ్యం కుదుర్చుకుంది.

‘గ్యాప్ ఇంక్’తో Reliance భాగస్వామ్యం

ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్... భారతీయ అవుట్‌లెట్‌లలో తన ఉత్పత్తులను పంపిణీ చేయడానికి అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్ ‘గ్యాప్ ఇంక్’తో దీర్ఘకాలిక భాగస్వామ్యం కుదుర్చుకుంది. బుధవారం ఈ మేరకు రిలయన్స్ నుంచి ప్రకటన వెలువడింది. ప్రత్యేకమైన బ్రాండ్ దుకాణాలు, మల్టీ బ్రాండ్ స్టోర్ ఎక్స్‌ప్రెషన్‌లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల కలయిక ద్వారా, రిలయన్స్ రిటైల్ భారతీయ వినియోగదారులకు గ్యాప్‌కు సంబంధించిన అత్యంత ఇటీవలి ఫ్యాషన్ ఆఫర్‌లను అందుబాటులోకి తేనుంది.


భాగస్వామ్యం గురించి వ్యాఖ్యానిస్తూ... రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో ఫ్యాషన్ & లైఫ్‌స్టైల్ CEO అఖిలేష్ ప్రసాద్ ఈ క్రమంలో మాట్లాడుతూ ‘రిలయన్స్ రిటైల్‌లో మా కస్టమర్‌లకు సరికొత్త ఉత్పత్తులను అందస్తామని చెప్పేందుకు గర్విస్తున్నాం. ఐకానిక్ అమెరికన్ బ్రాండ్‌తో భాగస్వామ్యం పట్ల హర్షం ప్రకటిస్తున్నాం’ అని పేర్కొన్నారు. గ్యాప్ ఇంక్‌లో ఇంటర్నేషన్, గ్లోబల్ లైసెన్సింగ్, హోల్‌సేల్ మేనేజింగ్ డైరెక్టర్ అడ్రియెన్ గెర్నాండ్, రిలయన్స్ రిటైల్‌తో ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. యాభై ఏళ్ళ క్రితం(1969లో) శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపితమైన  గ్యాప్... దాని డెనిమ్ ఉత్పత్తులను విస్తరించడం, ఆన్‌లైన్‌లో కంపెనీ నిర్వహించే స్టోర్లు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిటైల్ ఫ్రాంచైజీల ద్వారా కస్టమర్లతో కనెక్ట్ కావడం కొనసాగిస్తోంది. 

Updated Date - 2022-07-07T02:35:10+05:30 IST