వీశాట్‌ ఫలితాలు విడుదల.. 10 నుంచి కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-06-07T09:29:59+05:30 IST

బీటెక్‌, బీ ఫార్మశీల్లో ప్రవేశాల కోసం విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన విశాట్‌ 2020 ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఎంవైఎస్‌ ప్రసాద్‌ విడుదల చేశారు. గుంటూరు సమీపంలోని వడ్లమూడి విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో ఫలితాలు

వీశాట్‌ ఫలితాలు విడుదల.. 10 నుంచి కౌన్సెలింగ్‌

గుంటూరు(విద్య), జూన్‌ 6: బీటెక్‌, బీ ఫార్మశీల్లో ప్రవేశాల కోసం విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన విశాట్‌ 2020 ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఎంవైఎస్‌ ప్రసాద్‌ విడుదల చేశారు. గుంటూరు సమీపంలోని వడ్లమూడి విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతేడాది కంటే ఈ ఏడాది పరీక్షకు 20 శాతం ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యారని వీసీ పేర్కొన్నారు. విద్యార్థుల ర్యాంకుల ఆధారంగా జూన్‌ 10 నుంచి ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. వీశాట్‌లో 1 నుంచి 100లోపు ర్యాంకులు సాధించిన వారికి 75 శాతం స్కాలర్‌షిప్‌, 100 నుంచి 200లోపు ర్యాంకులు వచ్చిన వారికి 50 శాతం, 201 నుంచి 400లోపు ర్యాంకులు వచ్చిన వారికి 25 శాతం, అదే విధంగా 401 నుంచి 2 వేలలోపు ర్యాంకు వారికి 10 శాతం స్కాలర్‌షిప్‌ కల్పిస్తామని తెలిపారు.

Updated Date - 2020-06-07T09:29:59+05:30 IST