సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు.. కాజలో పైలట్‌

ABN , First Publish Date - 2020-06-07T08:30:53+05:30 IST

గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన క్లస్టర్లలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టనుంది. సబ్‌రిజిస్ర్టార్‌కార్యాలయం దూరంగా ఉన్న గ్రామాల్లో, అత్యధికంగా

సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు.. కాజలో పైలట్‌

అమరావతి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన క్లస్టర్లలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టనుంది. సబ్‌రిజిస్ర్టార్‌కార్యాలయం దూరంగా ఉన్న గ్రామాల్లో, అత్యధికంగా రిజిస్ర్టేషన్లు జరిగే కార్యాలయాలకు సమీపంలో ఉన్న గ్రామ సచివాలయాల్లో ఈ అవకాశం కల్పించనుంది. తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా గుంటూరు జిల్లాలోని కాజ గ్రామ సచివాలయాన్ని ఎంపిక చేశారు. గతంలో ఈ గ్రామ పరిధి, దానికి సమీపంలోని పెదకాకాని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఏడాదికి 1,300 డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అయ్యాయి. ఇక్కడి గ్రామ సచివాలయం జాతీయ రహదారికి ఆనుకుని ఉండడం కూడా మరో కారణంగా చెబుతున్నారు.

Updated Date - 2020-06-07T08:30:53+05:30 IST