కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోండి

ABN , First Publish Date - 2022-08-06T09:23:07+05:30 IST

కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోండి

కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోండి

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా 

అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఎ్‌సఆర్‌)-2023 ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా శుక్రవారం ప్రకటించారు. 2023 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండుతున్నవారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీరితోపాటు 2023 ఏప్రిల్‌ 1, మే 1, జూలై 1, అక్టోబరు 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండేవారు కూడా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఓటర్ల నమోదు, తొలగింపులకు సంబంధించి ఆగస్టు 4 నుంచి అక్టోబరు 24 వరకు అవకాశం ఉందని తెలిపారు. డిసెంబరు 3,4 తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల్లో ఓటరు నమోదు కోసం బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారన్నారు. 2023 జనవరి 5న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామన్నారు. ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

Updated Date - 2022-08-06T09:23:07+05:30 IST