కనీవినీ ఎరుగని బ్యాటరీతో వచ్చేసిన ‘రియల్‌మి సి12’

ABN , First Publish Date - 2020-08-15T02:54:04+05:30 IST

ఈ నెల 18న భారత్‌లో విడుదల కావడానికి ముందే ‘రియల్‌మి సి12’ స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియాలో విడుదలైంది.

కనీవినీ ఎరుగని బ్యాటరీతో వచ్చేసిన ‘రియల్‌మి సి12’

న్యూఢిల్లీ: ఈ నెల 18న భారత్‌లో విడుదల కావడానికి ముందే ‘రియల్‌మి సి12’ స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియాలో విడుదలైంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అయిన ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, ట్రిపుల్ రియర్ కెమెరా, 6000 ఎంఏహెచ్‌ సామర్థ్యం కలిగిన అతిపెద్ద బ్యాటరీ వంటివి ఈ ఫోన్ ప్రత్యేకత.  3జీబీ ర్యామ్+32 జీబీ సింగిల్ వేరియంట్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర భారత్‌లో దాదాపు రూ. 10 వేలు ఉండే అవకాశం ఉంది. 


రియల్‌మి సి12‌ స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి యూఐ ఓఎస్, 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, మీడియాటెక్ హెలియా జి35 ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32జీబీ ఆన్‌బోర్డు స్టోరేజీ, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి. 13 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10W చార్జింగ్, వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటివి ఉన్నాయి.  

Updated Date - 2020-08-15T02:54:04+05:30 IST