Abn logo
Jul 30 2020 @ 21:58PM

గెట్ రెడీ.. 31నే రియల్‌మి 6ఐ సేల్

న్యూఢిల్లీ: ఈ నెల మొదట్లో భారత్‌లో లాంచ్ చేసిన రియల్‌మి 6ఐ స్మార్ట్‌ఫోన్ రేపు (జులై 31న) మధ్యాహ్నం సేల్‌కు రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మి డాట్ కామ్, ఫ్లిఫ్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానున్నట్టు రియల్‌మి తెలిపింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. 4జీబీ/64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 12,999 కాగా, 6జీబీ ర్యామ్/64జీబీ ఆప్షన్ ధర రూ. 14,999 మాత్రమే. 


రియల్‌మి 6ఐ స్పెసిఫికేషన్లు:  6.5 అంగుళాల ఫుల్ ‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, మీడియా టెక్ హెలియో జి90టి ప్రాసెసర్, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు, ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంది. 4,300 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించగా 30W ఫ్లాష్ చార్జ్‌కు సపోర్ట్ చేస్తుంది. 


Advertisement
Advertisement
Advertisement