బద్వేల్ కౌంటింగ్‌కు అన్నీ సిద్ధం

ABN , First Publish Date - 2021-11-02T01:40:00+05:30 IST

బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బరిలో ఎవరి బలం ఎంతో మంగళవారం తేలనుంది.

బద్వేల్ కౌంటింగ్‌కు అన్నీ సిద్ధం

బద్వేలు: బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బరిలో ఎవరి బలం ఎంతో మంగళవారం తేలనుంది. ఉప ఎన్నికల ఫలితం కంటే పోటీ చేసిన ప్రధాన పార్టీల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు, గెలిచేవారి మెజార్టీ ఎంత, రెండవ స్థానంలో నిలబడే పార్టీకి ఎన్ని ఓట్లు రావచ్చు అనే దానిపైనే ఉత్కంఠ సాగుతోంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేతన్‌గార్గ్‌ సోమవారం కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలించారు. కౌంటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్‌ మొదలు కానుంది. నాలుగు హాళ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 2,15,392 ఓట్లకుగాను 1,46,562 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్ల ప్రకారం దాదాపు అన్ని టేబుళ్లతో పది  నుంచి 12 రౌండ్ల వరకు కౌంటింగ్‌ సాగే అవకాశం ఉంది. అన్ని టేబుళ్లవద్ద ఒక్కో రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత వాటిని అన్నింటిని కలిపి ఫలితాలను వెల్లడిస్తారు. మధ్యాహ్నానికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

Updated Date - 2021-11-02T01:40:00+05:30 IST