Abn logo
Apr 22 2021 @ 19:13PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

ముంబై: రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. తమ జట్టులో రజత్ పాటిదార్‌ను తొలగించి కేన్ రిచర్డ్‌సన్‌ను తీసుకున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇక రాయల్స్ జట్టులో జయదేవ్ ఉనద్కత్ స్థానంలో శ్రేయాస్ గోపాల్‌ను తీసుకున్నట్లు ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ వెల్లడించాడు. 

ఇరు జట్లు:

ఆర్సీబీ: విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, షహబాజ్ అహ్మద్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్), కైల్ జేమీసన్, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, కేన్ రిచర్డ్‌సన్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.


రాజస్థాన్ రాయల్స్: జాస్ బట్లర్, మనన్ వోహ్రా, సంజు శాంసన్(కెప్టెన్, కీపర్), శివమ్ దూబే, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, శ్రేయాస్ గోపాల్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్.


Advertisement
Advertisement
Advertisement