ఆర్‌బీఐ పాలసీ, గణాంకాలతోనే దిశ

ABN , First Publish Date - 2022-04-04T07:48:45+05:30 IST

ఈ వారం మార్కెట్ల గమనాన్ని స్థూల ఆర్థిక గణాంకాలు, ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానం నిర్దేశించే వీలుంది.

ఆర్‌బీఐ పాలసీ, గణాంకాలతోనే దిశ

ఈ వారం మార్కెట్ల గమనాన్ని స్థూల ఆర్థిక గణాంకాలు, ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానం నిర్దేశించే వీలుంది. స్టాక్‌ మార్కెట్లు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించటం కూడా మార్కెట్లుకు కలిసిరానుంది. నిప్టీ గత వారం 17600 మార్కును అధిగమించి పటిష్ఠంగా క్లోజైంది. బ్యాంకిం గ్‌ విభాగంలో ర్యాలీ కూడా మార్కెట్లకు దన్నుగా నిలిచింది. ఈ వారం నిఫ్టీ మానసిక అవధి స్థాయిలైన 17800 మార్కు ను అధిగమిస్తే 18000 దిశగా సాగే అవకాశం ఉంది. ఒకవేళ డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తే మాత్రం 17500, 17350 వద్ద మద్దతు స్థాయిలుంటాయి. 

స్టాక్‌ రికమండేషన్స్‌ 

ఇండియా సిమెంట్స్‌: సిమెంట్‌ విభాగంలోని ఈ షేరు గత నాలుగైదు నెలలుగా కరెక్షన్‌కు లోనవుతూ వస్తోంది. అయితే గత వారం ఈ షేరు ఆ ఒత్తిడి నుంచి బయటపడింది. డైలీ చార్టుల ప్రకారం చూస్తే కప్‌ అండ్‌ హ్యాండిల్‌ ప్యాట్రన్‌తో బుల్లిష్‌ ధోరణిని సూచిస్తోంది. గత శుక్రవారం రూ.218.30 వద్ద క్లోజైన ఈ షేరును రూ.235 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.208.40 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


హెచ్‌డీఎ్‌ఫసీ ఏఎంసీ: గడచిన కొన్నేళ్లుగా ఈ షేరు ఏమాత్రం ఎదుగుబొదుగు లేకుండా సాగుతూ వస్తోంది. 2020  మార్చి తర్వాత వచ్చిన బుల్‌రన్‌లోనూ ఈ షేరు పేలవమైన పనితీరును కనబరిచింది. అయితే గత వారం ఈ షేరులో ఒక్కసారిగా కదలిక ఏర్పడింది. డైలీ చార్టుల ప్రకారం చూస్తే ధర, వాల్యూమ్‌పరంగా కొంత బ్రేకౌట్‌ సాధించినట్లు కనిపిస్తోంది. అయితే ఇది ఇలాగే కొనసాగుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పటం కష్టం. గత శుక్రవారం రూ.2,276.50 వద్ద క్లోజైన ఈ షేరును స్వల్పకాలానికి రూ.2,390 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,195 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


         - సమీత్‌ చవాన్‌, చీఫ్‌ ఎనలి్‌స్ట,టెక్నికల్‌,  డెరివేటివ్స్‌, ఏంజెల్‌ వన్‌ లిమిటెడ్‌  

Updated Date - 2022-04-04T07:48:45+05:30 IST