Remond Ltd : స్వదేశీ టెక్స్‌టైల్ మేజర్ రేమండ్ లిమిటెడ్ జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. గత 10 ఏళ్లలో అత్యధిక త్రైమాసిక ఆదాయం, లాభదాయకతతో అద్భుతమైన ఫలితాలను సాధించినట్టు రేమండ్ లిమిటెడ్ శుక్రవారం ప్రకటించింది. తన ఆదాయం(Remond Income) రూ. 1,754 కోట్లు, గతేడాదితో పోలిస్తే 104 శాతం పెరిగింది. కంపెనీ గత 10 సంవత్సరాలలో 13.4 శాతం మార్జిన్‌తో ఎబిటా కంటే ముందు అత్యధిక క్యూ1 ఆదాయాలను రూ. 235 కోట్లకు చేర్చింది.
రేమండ్ చైర్మన్, ఎండీ గౌతమ్ హరి సింఘానియా(Gautam Hari Singhania) ఒక ప్రకటనలో.. “అంతర్జాతీయ మార్కెట్ల(International Markets)లో కొనుగోళ్ల పెరడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ ఈ త్రైమాసికంలో బాగా కలిసొచ్చింది. మా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్(Real Estate Project) అమ్మకాల వేగం, థానే వద్ద ఉన్న రెండు ప్రాజెక్ట్‌ల నిర్మాణ వేగంతో బాగా పురోగమిస్తోంది. ఇది మా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బలమైన పనితీరును అందించడంలో మాకు సహాయడింది’’ అని పేర్కొన్నారు.
రాబోయే పండుగ, వివాహాల సీజన్ అమ్మకాలను అనుగుణంగా ఉత్పత్తని పెంచడానికి కంపెనీ తాత్కాలికంగా అధిక ఇన్వెంటరీని ఎదుర్కొంది. దాని వర్కింగ్ క్యాపిటల్(Working Capital) అమాంతం పెరిగింది. దీంతో నికర అప్పు రూ.222 కోట్లు పెరిగి రూ.1,310 కోట్లకు చేరుకుంది. రేమండ్ బ్రాండెడ్ టెక్స్‌టైల్ సెగ్మెంట్ విక్రయాలు గత ఏడాది తొలి త్రైమాసికంలో నిర్వహించిన రూ.283 కోట్ల నుంచి 129 శాతం వృద్ధిని సాధించి రూ. 648 కోట్లకు చేరుకున్నాయి. వేసవి వివాహాల సీజన్‌లో అధిక డిమాండ్, సెకండరీ సేల్స్‌లో బలమైన ఊపందుకుంది. దీంతో ఎబిటా మార్జిన్ 17.6 శాతం నమోదు కాగా.. అమ్మకాలు రూ.262 కోట్లకు పెరిగాయి.