8వ విడత రేషన్‌ పంపిణీ బహిష్కరణ

ABN , First Publish Date - 2020-07-14T08:37:07+05:30 IST

కరోనా సమయంలో రాష్ట్ర రేషన్‌ డీలర్‌లు రోడ్డెక్కారు. న్యాయమైన తమ డిమాండ్స్‌ తీర్చకపోతే ఈనెల 18 నుంచి మొదలయ్యే 8వ విడత రేషన్‌ పంపిణీని

8వ విడత రేషన్‌ పంపిణీ బహిష్కరణ

విజయవాడ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కరోనా సమయంలో రాష్ట్ర రేషన్‌ డీలర్‌లు రోడ్డెక్కారు. న్యాయమైన తమ డిమాండ్స్‌ తీర్చకపోతే ఈనెల 18 నుంచి మొదలయ్యే 8వ విడత రేషన్‌ పంపిణీని బహిష్కరిస్తామని ప్రకటించారు.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు మండాది వెంకట్రావు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జాయింట్‌ కలెక్టర్లు, తహశీల్దార్లకు ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వాలు వినతి పత్రాలు ఇచ్చారు. ది ఈపోస్‌ ఆపరేటర్స్‌ సంక్షేమ సమాఖ్య, ఆంధ్రప్రదేశ్‌ చౌక ధరల దుకాణదారుల సంఘాల సంక్షేమ సమాఖ్యలు కూడా ఈ సంఘ పిలుపునకు మద్దతు ప్రకటించాయి. సోమవారం సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ కోన శశిధర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సూర్యకుమారిలకు సంఘ నేతలు లేఖలు ఇచ్చారు. 

Updated Date - 2020-07-14T08:37:07+05:30 IST