రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ మండలం గండిగుడా గ్రాండ్ విల్లే వెంచర్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్ వెళ్లాడు. అదును చూసిన గుర్తుతెలియని దుండగులు తాళం పగలగొట్టి 15 తులాల బంగారం, మూడున్నర లక్షల నగదుతో ఉడాయించారు. ఊరు నుండి వచ్చిన రవిందర్ రెడ్డి ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్ళి చూడగా బంగారంతో పాటు నగదు కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దింపి ఆధారాలను సేకరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి