Abn logo
Aug 4 2021 @ 10:52AM

Rangareddy: రాజేంద్రనగర్ ఔటర్ రింగ్‌రోడ్‌పై లారీని ఢీకొన్న కారు..మహిళ మృతి

రంగారెడ్డి: రాజేంద్రనగర్ ఔటర్ రింగ్‌రోడ్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలంచారు. ఈ ఘటన శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ నిద్రమత్తని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.