హలీం తయారీ వద్దు: పిస్తా హౌస్ ఓనర్

ABN , First Publish Date - 2020-04-22T12:42:06+05:30 IST

హలీం తయారీ వద్దు: పిస్తా హౌస్ ఓనర్

హలీం తయారీ వద్దు: పిస్తా హౌస్ ఓనర్

హైదరాబాద్: కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరం రంజాన్ మాసంలో హలీం తయారు చేయవద్దని అన్ని హోటల్స్ యజమానులు కలిసి నిర్ణయం తీసుకున్నామని పిస్తా హౌస్ యజమాని ఎండి అబ్దుల్ మజీద్ వినతి చేశారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆంక్షలు విధించిందని..అందరూ ఇంట్లోనే ఉండాలని కోరారు. తమతో పాటు తమ కస్టమర్లు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లోని అన్ని హోటళ్ల యజమనాలు కలిసి ఈ ఏడాది హలీం తయారు చేయవద్దని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాది రంజాన్ మాసం హలీం లభించకపోవడం ఎంతో విచారకరమని....వినియోగదారులను క్షమాపణలు కోరుతున్నామని అన్నారు. వచ్చే సంవత్సరం కచ్చితంగా హలీం తయారు చేసి కస్టమర్లకు అందజేస్తామని అబ్దుల్ వెల్లడించారు. 

Updated Date - 2020-04-22T12:42:06+05:30 IST