‘వరంగల్‌’ ఎమ్మెల్సీ బరిలో రాములునాయక్‌!

ABN , First Publish Date - 2021-01-14T07:51:27+05:30 IST

ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానికి అభ్యర్థిని రంగంలోకి దించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ పేరును ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఈ

‘వరంగల్‌’ ఎమ్మెల్సీ బరిలో రాములునాయక్‌!

హైదరాబాద్‌, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానికి అభ్యర్థిని రంగంలోకి దించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ పేరును ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న కోదండరామ్‌కు మద్దతు ఇవ్వాలంటూ గతంలోనే టీజేఎస్‌ ప్రతినిధులు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను కలిసి కోరారు. ఈ అంశంపై గాంధీ భవన్‌లో ఇటీవల సమావేశమైన ముఖ్యనేతలు.. వరంగల్‌ పట్టభద్రుల స్థానం నుంచి పార్టీ అభ్యర్థినే బరిలోకి దించాలని నిర్ణయించారు. సాగర్‌ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ఖమ్మం స్థానంలో ఎస్టీ అభ్యర్థినే రంగంలోకి దించాలని అనుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌ పట్టభద్రుల స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, చిన్నారెడ్డిలలో ఒకరిపేరు ఖరారయ్యే అవకాశం ఉంది.


ఈ నేపథ్యంలో ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి రెడ్డియేతర అభ్యర్థిని రంగలోకి దించడం అనివార్యంగా మారింది. ఖమ్మం పట్టభద్రుల స్థానంలో ఎస్టీని అభ్యర్థిగా నిలబెడితే.. సాగర్‌ ఉప ఎన్నికకు కొంత కలిసొస్తుందన్న ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. పదవీకాలం ఉండగానే కాంగ్రె్‌సలో చేరడంతో రాములునాయక్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీ టికెట్‌ ఆశించినా దక్కలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీటుపై రాములునాయక్‌ గట్టిగా పట్టుపట్టినట్లు తెలిసింది. పలు సమీకరణల రీత్యా ఆయన అభ్యర్థిత్వాన్నే పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-01-14T07:51:27+05:30 IST