గిరిజనులను మోసం చేసిన టీఆర్ఎస్ సర్కార్ : రాములు నాయక్

ABN , First Publish Date - 2020-08-12T02:04:12+05:30 IST

రాష్ట్రంలోని గిరిజనులను టీఆర్ఎస్ సర్కార్ మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసినందుకు ప్రజలంతా సంతోషించారని

గిరిజనులను మోసం చేసిన టీఆర్ఎస్ సర్కార్ : రాములు నాయక్

హైదరాబాద్: రాష్ట్రంలోని గిరిజనులను టీఆర్ఎస్ సర్కార్ మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసినందుకు ప్రజలంతా సంతోషించారని, అయితే తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ప్రభుత్వం.. వాటిని రెవెన్యూ విలేజ్‌గా చేయడం మరిచిందని విమర్శించారు. ఇదే అంశంపై మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులు ఇవ్వడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. తండాలను పంచాయతీలుగా మారినా.. ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. ఇప్పటికీ తండాల్లో మౌలిక వసతులు కల్పించలేదని ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. గ్రామ పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. సబ్ ప్లాన్ నిధులను క్యారీ ఫార్వర్డ్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రాములు నాయక్ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-12T02:04:12+05:30 IST