Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 18 2021 @ 09:22AM

తెలివి ఉన్న వారెవరైనా అలా చేస్తారా?: రాములమ్మ ఫైర్

హైదరాబాద్: తెలంగాణకు విముక్తినిచ్చిన సెప్టెంబర్ 17వ తేదీని టీఆర్ఎస్, బీజేపీలు నిర్వహించిన తీరుపై బీజేపీ నాయకురాలు రాములమ్మ విమర్శలు గుప్పించారు. మనకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అందించిన విమోచనోత్సవంగా కాకుండా కేవలం భారతదేశంలో నిజాం సంస్థానం (తెలంగాణ) విలీనం చేసినట్లు భావిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు విలీనోత్సవం నిర్వహించాయన్నారు. కాస్త తెలివి ఉన్నవారెవరైనా అలా చేస్తారా అంటూ రాములమ్మ మండిపడ్డారు.

‘‘నిజాంల అరాచక పాలన నుంచి తెలంగాణకు విముక్తినిచ్చిన సెప్టెంబర్ 17వ తేదీని.... మనకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అందించిన విమోచనోత్సవంగా కాకుండా.... కేవలం భారతదేశంలో నిజాం సంస్థానం (తెలంగాణ) విలీనం చేసినట్లు భావిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు విలీనోత్సవం నిర్వహించాయి. స్వాతంత్ర్యం అంటే రాక్షస రజాకార్ల అధికార నియంతృత్వం నుంచి విమోచనమా... లేక కేవలం భారతదేశంలో విలీనమా? ఎన్ని మాటలు తిప్పి చెప్పినా... దుష్టుల దుర్మార్గాల నుంచి బయటపడితే విమోచనమే అంటారు.


ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ని అల్లకల్లోలం చేస్తున్న తాలిబన్ పాలన నుంచి ఆఫ్ఘన్ ప్రజలు పోరాడి విముక్తులైతే అది విమోచనమౌతుందా?... కాదా?... లేదూ పాకిస్తాన్ లాంటి దేశాల దుష్ప్రచారం ప్రకారం విద్రోహమౌతుందా...? మతవాద MIM, దాని సయామి ట్విన్ TRS... ఆ ఇద్దరికి విధాన సమర్ధన ఇస్తున్న తెలంగాణ కాంగ్రెస్ తేల్చాలి. ప్రజావ్యతిరేక పాలన...  రజాకార్ల అరాచకాల నుంచి విముక్తి పొందినందుకు సెప్టెంబర్ 17వ తేదీని కాస్త తెలివి ఉన్నవారెవరైనా విమోచనదినంగానే పాటిస్తారు. విచిత్రం ఏమిటంటే... విలీనోత్సవం అంటూ పార్టీ కార్యక్రమంగా మాత్రమే దీనిని నిర్వహిస్తున్న అధికార పార్టీవారికి.... ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ విమోచనోత్సవాన్ని నిర్వహించడానికి మాత్రం ధైర్యం చాలకపోవడం’’ అని రాములమ్మ పేర్కొన్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement