రామప్పలో సందడే.. సందడి

ABN , First Publish Date - 2021-10-18T06:10:38+05:30 IST

రామప్పలో సందడే.. సందడి

రామప్పలో సందడే.. సందడి

వెంకటాపూర్‌(రామప్ప), అక్టోబరు 17: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రాలింగేశ్వర ఆలయంలో ఆదివారం సందడి నెలకొంది. పండుగ సెలవులు కావడంతో  భారీ సంఖ్యలో పర్యాటకులు, భక్తులు సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శిల్పకళా సంపదను తిలకించి మంత్రముగ్ధులయ్యారు. టూరిజం గైడ్ల ద్వారా ఆలయ విశిష్టతను తెలుసు కున్నారు. అనంతరం సరస్సు వద్దకు చేరుకొని బోటింగ్‌ చేస్తూ ఆహ్లాదంగా గడిపారు. 




Updated Date - 2021-10-18T06:10:38+05:30 IST