జలదిగ్బంధంలో రామన్నగూడెం
ABN , First Publish Date - 2022-07-15T17:07:19+05:30 IST
భారీ వర్షాలతో ఏటూరునాగారం మండలం రామన్నగూడెం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది.
ములుగు: భారీ వర్షాలతో ఏటూరునాగారం మండలం రామన్నగూడెం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. వరదనీరు పుష్కర ఘాట్ దాటి గ్రామంలోకి వస్తున్నాయి. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమను పట్టించుకునేవారే లేరని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పలు ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు ఆపై చేతులు దులుపుకున్నారు. ఎప్పుడు ఏమవుతుందో అంటూ గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.