Abn logo
Sep 17 2021 @ 00:53AM

‘గజ్వేల్‌ సభకు భారీ జనసమీకరణ చేయాలి’

మాట్లాడుతున్న దండోరా జిల్లా ఇన్‌చార్జి విజయ రమణారావు

జనగామ టౌన్‌, సెప్టెంబరు 16 : గజ్వేల్‌లో శుక్రవారం జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో జనం తరలివచ్చేలా కృషి చేయాలని దండోరా జిల్లా ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో జన సమీకరణపై పార్టీ క్యాడర్‌కు సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి న సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు, టీఆర్‌ఎస్‌ వినాశకర పాలన విముక్తి కోసం కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ప్రారంభించిన ఉద్యమం నిర్వీరామంగా సాగించాలన్నారు. వినాశకర పాలన సాగించే టీఆర్‌ఎ్‌సను బొందపెట్టే వరకు కలిసికట్టుగా పని చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో అడుగడుగునా దళిత, గిరిజనులకు మోసం, దగా జరుగుతోందని, దళిత, గిరిజనుల చైతన్యమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ దండోరా సభలు మోగిస్తోందన్నారు.

 సమావేశంలో ఎర్రమల్ల సుధాకర్‌, సత్యనారాయణ రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, చిర్ర సత్యనారాయణ రెడ్డి, మారబోయిన పాండు, గాదెపాక రాంచందర్‌, మేడ శ్రీను, చింతకింది మల్లేష్‌, ఎండీ జమాల్‌ షరీఫ్‌, ఎండీ అన్వర్‌, కొత్త కరుణాకర్‌ రెడ్డి, రాం దయాకర్‌రెడ్డి, అభిగౌడ్‌, యాట క్రాంతి, దూడల సిద్ధయ్య, బాలరాజు, గాదెపాక సరిత పాల్గొన్నారు.