భారతీయులందరినీ స్వదేశానికి తీసుకొస్తాం.. ప్రభుత్వమే ఈ ఖర్చంతా భరిస్తుంది: రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2022-02-28T00:17:07+05:30 IST

రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్‌లో ఇరుక్కుపోయిన భారతీయులందరినీ కేంద్రం సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తాజాగా పేర్కొన్నారు.

భారతీయులందరినీ స్వదేశానికి తీసుకొస్తాం.. ప్రభుత్వమే ఈ ఖర్చంతా భరిస్తుంది: రాజ్‌నాథ్ సింగ్

ఇంటర్నెట్ డెస్క్: రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్‌లో ఇరుక్కుపోయిన భారతీయులందరినీ కేంద్రం సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తుందని  రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తాజాగా పేర్కొన్నారు. ఇందుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న దేశాలకు విమాన సర్వీసుల సంఖ్యను కూడా పెంచామని తెలిపారు. జాతీయ మీడియాతో ఆదివారం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయులు రోడ్డు మార్గం ద్వారా పొరుగు దేశాలకు చేరుకుని, అక్కడి నుంచి విమానాల్లో భారత్‌కు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా దేశాల అధికారులు, అక్కడ ఉన్న భారతీయ ఎంబసీ అధికారుల బృందాలు.. ఉక్రెయిన్ నుంచి వస్తున్న భారతీయులకు ఈ ప్రయాణంలో కావాల్సిన సాయం చేస్తున్నాయి. 

Updated Date - 2022-02-28T00:17:07+05:30 IST