తడబడుతున్న రాజస్థాన్.. మిల్లర్ ఒంటరి పోరాటం!

ABN , First Publish Date - 2021-04-16T04:08:49+05:30 IST

రాజస్థాన్ బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఇబ్బందులు పడటంతో గెలుపు రాజస్థాన్ వశం అవుతుందని అభిమానులు భావించారు. అయితే ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్.. ఉత్కంఠభరితంగా మారింది.

తడబడుతున్న రాజస్థాన్.. మిల్లర్ ఒంటరి పోరాటం!

ముంబై: రాజస్థాన్ బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఇబ్బందులు పడటంతో గెలుపు రాజస్థాన్ వశం అవుతుందని అభిమానులు భావించారు. అయితే ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్.. ఉత్కంఠభరితంగా మారింది. రాజస్థాన్ బౌలర్ల మాదిరిగానే ఢిల్లీ బౌలర్లు కూడా బ్యాట్స్‌మెన్ భరతం పడుతున్నారు. దీంతో బెంబేలెత్తిన రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. కనీసం 50 పరుగులు కూడా చేయకుండానే జట్టులో 5 కీలక వికెట్లు కోల్పోయింది రాజస్థాన్.


ఓపెన్లరు జోస్ బట్లర్ (2), మనన్ వోహ్రా(9) సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుట్ అయిపోయారు. వీరిద్దరి వికెట్లనూ క్రిస్ వోక్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ (4), శివమ్ దూబే (2) కూడా ప్రభావం చూపలేదు. డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 43 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తుండగా.. రియాన్ పరాగ్ (2) కూడా నిరాశ పరిచాడు. ప్రస్తుతం మిల్లర్‌కు తోడుగా రాహుల్ తెవాటియా క్రీజులో ఉన్నాడు. వీరిద్దరిపైనే రాజస్థాన్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయనడం అతిశయోక్తి కాదు. మరి చూడాలి మ్యాచ్ ఎలా ముగుస్తుందో. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2, అవేష్ ఖాన్ 2, రబాడ ఒక వికెట్ కూల్చారు.


Updated Date - 2021-04-16T04:08:49+05:30 IST