గొడవపడ్డ అమ్మాయిలిద్దరినీ ఒకే గదిలో ఉండమన్నారు.. అయితే ఓ అమ్మాయి ప్రతిరోజు రాత్రి చేసే పనికి.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న మరో యువతి..!

ABN , First Publish Date - 2021-10-28T17:37:41+05:30 IST

ఆ అమ్మాయిలిద్దరి మధ్య..

గొడవపడ్డ అమ్మాయిలిద్దరినీ ఒకే గదిలో ఉండమన్నారు.. అయితే ఓ అమ్మాయి ప్రతిరోజు రాత్రి చేసే పనికి.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న మరో యువతి..!

ఇంటర్‌నెట్‌డెస్క్: ఆ అమ్మాయిలిద్దరి మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మొదటిసారి గొడవ పడినప్పుడే.. కాలేజీ అధ్యాపకులు హెచ్చరించారు. అయినా వారిద్దరి మధ్య గొడవలు తగ్గలేదు. దీంతో వారిద్దరినీ హాస్టల్‌లో ఒకే గదిలో ఉండమని ఆదేశించారు. కానీ అందులో ఓ అమ్మాయి ప్రతిరోజు రాత్రి గదిలో చేసే పనికి మరో అమ్మాయి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని బికనీర్‌ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..

 

జిల్లాలోని కోట్‌పుట్లీ ప్రాంతానికి చెందిన ముఖేష్ అనే కారు డ్రైవర్ కూతురు సర్దార్ పటేల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నర్సింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. ఆమె పేరు ఆయుష్(22). హాస్టల్‌లో ఉంటూ కాలేజీకి వెళ్తోంది. అయితే ఆయుష్‌కు అదే కాలేజీకి చెందిన చందా ప్రజాపత్ అనే అమ్మాయికి మధ్య ఏడు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ యువతులిద్దరు ఇంకెప్పుడు గొడవపడకూడదని కాలేజీ యాజమాన్యం ఓ నిర్ణయానికొచ్చింది. వారిద్దరు హాస్టల్‌లో ఒకే గదిలో ఉంటే మారుతారని భావించింది.





అయితే చందా ప్రజాపత్‌కు రాత్రిపూట చదివే అలవాటు ఉంది. దీంతో వారుంటున్న గదిలో ప్రతిరోజు లైట్స్ వెలుగుతునే ఉండేవి. కానీ ఆయుష్‌ పది గంటలకే పడుకునేది. దీంతో వారిద్దరి మధ్య ఈ లైట్స్ విషయంలో కూడా గొడవలు జరిగేవి. ఉదయం లేచి చదువుకో అని ఆయుష్ ఎంత చెప్పినా.. ఆమె వినలేదు. ‘‘ఈ సమయంలో చదువుకుంటా..’’అని చందా చెప్పేది. రాత్రంతా అలా లైటింగ్ వెలుతురులో పడుకోవడం వల్ల ఆయుష్‌కు మైగ్రేన్ సమస్య తలెత్తింది. దీంతో ఆమె తీవ్రమైన మనస్తాపానికి గురైంది. చివరికి బుధవారం ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గదిలో చందా ప్రజాపత్ లేని సమయం చూసి ఫ్యానుకు ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయానికి హాస్టల్‌లో ఉంటున్న తోటి విద్యార్థినులు విస్తుపోయారు. 


ఆయుష్ తండ్రి ముఖేష్ మాట్లాడుతూ చందా ప్రజాపత్ వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని చందాను విచారిస్తున్నారు. అయితే ఆయుష్ ఆత్మహత్య చేసుకునే ముందు చందా ప్రజాపత్‌కు, మరో విద్యార్థిని నహర్ సింగ్‌కు వీడియో కాల్ చేసిందని కాల్ రికార్డ్స్‌ ద్వారా తెలిసింది. ఆయుష్ చనిపోయే ముందు వారిద్దరితో ఏం మాట్లాడిందనే విషయం కనుక్కునే పనిలో పోలీసులు పడ్డారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-10-28T17:37:41+05:30 IST