ఏపీలో పలు జిల్లాల్లో ఈదురు గాలులతో వర్షం

ABN , First Publish Date - 2022-03-22T01:29:08+05:30 IST

ఏపీలో పలు జిల్లాల్లో ఈదురు గాలులతో వర్షం

ఏపీలో పలు జిల్లాల్లో ఈదురు గాలులతో వర్షం

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. విజయనగరం, ప్రకాశం, తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షం పడింది. భారీ ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పంటలు దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులకు ఆలమూరు మండలం గుమ్మిలేరులో చెట్లు నేలకొరిగాయి. విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలంలో పలు గ్రామాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. కొన్ని  గ్రామాల్లో మోస్తరుగా వర్షం కురిసింది. పెనుగాలులకు అరటి తోటలు నేల మట్టం అయ్యాయి.


పశ్చిమ గోదావరి జిల్లో ఏలూరులో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో  ఒక్కసారిగా  వాతావరణం చల్లబడింది. శ్రీకాకుళం జిల్లా రాజాంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, వడగళ్ల వానతో చెట్లు నేలకూలాయి. విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 


Updated Date - 2022-03-22T01:29:08+05:30 IST