దొంగ పోలీసుతో నన్ను హత్య చేసి వేరే అకౌంట్‌లో రాయాలని చూశారు: రఘురామ

ABN , First Publish Date - 2022-04-15T20:34:10+05:30 IST

దొంగ పోలీసుతో నన్ను హత్య చేసి వేరే అకౌంట్‌లో రాయాలని చూశారు: రఘురామ

దొంగ పోలీసుతో నన్ను హత్య చేసి వేరే అకౌంట్‌లో రాయాలని చూశారు: రఘురామ

అమరావతి: దొంగ పోలీసుతో తనను హత్య చేసి వేరే అకౌంట్‌లో రాయాలని చూశారని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. రామకృష్ణారెడ్డి అనే అధికారికి తన ఇంటి ముందు ఏం చేస్తున్నారని డీజీపీకి లేఖ రాసినట్లు చెప్పారు. ఇప్పటివరకు డీజీపీ స్పందించలేదని ఎంపీ రఘురామ అన్నారు. విచారణ జరపాలని కేంద్రహోంశాఖ సెక్రటరీకి లేఖ రాసినట్లు రఘురామ తెలిపారు.


ప్రసుత్తం ఏపీలో అమ్మఒడి స్కీమ్ ఒక్కటే ఉందని, అమ్మఒడి స్కీమ్‌కి 20 శాతం బెనిఫిషేర్స్ తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. జనవరిలో ఇచ్చే అమ్మఒడి స్కీమ్‌ను జూన్‌కి మార్చారని, 300 యూనిట్లు కరెంట్ వాడితే అమ్మఒడి కట్ అంటున్నారని, ఇదెక్కడి న్యాయం? అని ఎంపీ ప్రశ్నించారు. అమ్మఒడి పథకానికి, కరెంట్‌కి లింక్‌ పెట్టడం దివాళాకోరుతనమన్నారు.


సిగ్గులేకుండా రేషన్ బియ్యం కోటలో క్యాష్ ఇస్తామంటున్నారని, పెట్టింది ఆహార భద్రత స్కీమ్.. డబ్బుల స్కీమ్ కాదని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కిలో బియ్యానికి రూ. 28 పెట్టి ప్రజలకు అందిస్తుందని, ఆహార భద్రత స్కీమ్ కేంద్రానిది, మార్చే హక్కు రాష్ట్రానికి లేదని రఘురామ అన్నారు.


జగనన్న విద్యాదీవెన అంతా బోగస్ అని, విద్యాదీవెనలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేయడం ఎందుకు? అని రఘురామ ప్రశ్నించారు. జగనన్న ప్రజాస్వామ్యంలో వాక్ స్వేచ్ఛ లేకుండాపోయిందని, వాలంటరీ వ్యవస్థ ఒక దిక్కుమాలిందని విమర్శించారు. అక్కరలేని పనులకు వాలంటీర్లను వాడుకుంటున్నారని, కెమికల్ ఫ్యాక్టరీలో చనిపోయినవారికి 20 లక్షలు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు.


కాశ్మీర్ ఫైల్స్ లాగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి కేసు ఫైల్స్ అని, కోర్టు నుంచి తీసుకెళ్లారని వార్తలు వస్తున్నాయని, కోర్టు నుంచి మొదటిసారి ఫైల్స్ దొంగతనం జరిగాయని రఘురామ అన్నారు. టీటీడీకి ఫుల్‌టైం ఈవోను వేయాలని ఎంపీ రఘురామ డిమాండ్ చేశారు. సీపీఐ నారాయణ సతీమణి వసుమతి అకాలమరణం బాధాకరమని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.

Updated Date - 2022-04-15T20:34:10+05:30 IST