అప్పుడు అకౌంటెంట్ Sai Reddy బయట ఉండేవారు: Raghurama

ABN , First Publish Date - 2022-07-05T21:44:25+05:30 IST

ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజు కృతజ్ఞతలు తెలిపారు.

అప్పుడు అకౌంటెంట్ Sai Reddy బయట ఉండేవారు: Raghurama

ఢిల్లీ (Delhi): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) తన నియోజకవర్గానికి వచ్చి  అల్లూరి (Alluri)  కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతఙ్ఞతలు చెబుతున్నానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తితో తప్పు జరిగితే తిరగబడాలని మోదీ చెప్పారని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే తిరుగబడాలని ఆయన మాటలు అర్ధం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ గురించి ఒక్క మాట కూడా  మాట్లాడలేదన్నారు. ప్రధాని మనసులో భావాన్ని అర్థమయ్యేలా చెప్పారన్నారు. మంత్రి రోజాకు సెల్ఫీల పిచ్చి ఎక్కువన్నారు. విజయసాయిరెడ్డి ట్వీట్లపై స్పందించిన రఘురామ... ‘‘మాట్లాడితే సాయిరెడ్డి పెగ్గు అంటుండు.. వినురా అంటూ సాయిరెడ్డిపై రఘురామ వ్యాఖ్యలు.. నేను పెగ్గు రాజును అయితే వైస్సార్ కూడా పెగ్గు అవుతారు. నేను వైస్సార్ కలిసే పెగ్గు వేసే వాళ్ళము.. అప్పుడు అకౌంటెంట్ సాయిరెడ్డి బయట ఉండేవాడు. పెగ్గురెడ్డి పార్టీలో పెగ్గు రాజు ఉన్నాడు. పెగ్గు రెడ్డి పార్టీలో పెగ్గు రాజు ఉన్నాడని పాట పాడుకోమంటూ సెటైర్ వేశారు’’ 


అసలు ప్రభుత్వం సంక్షేమ పధకాలు ఎలా చేస్తుందో తెలుసు కదా... సంక్షేమానికి ప్రజల రక్తాన్ని జలగల్లా తాగుతున్నారని రఘురామ మండిపడ్డారు. ప్రజలు జగనన్న సంక్షేమాన్ని జలగన్న అని అంటున్నారన్నారు. చిన్నాన్న వివేకను వేసేసి.. అది చంద్రబాబు అకౌంట్‌లో వేశారన్నారు. కోడికత్తితో సానుభూతి కోట్టేశారన్నారు. ఇతరులను లేపేసి పక్కవాడి అకౌంట్‌లో వేశారన్నారు. సాయిరెడ్డిని ప్రధానమంత్రి హెలికాప్టర్ దగ్గరికి కూడా సీఎం జగన్ తీసుకురాలేదని, భారతి, జగన్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి సాయిరెడ్డి రాజ్యసభ ఎలా తెచ్చుకున్నారో అందరికి తెలుసన్నారు. ఇష్టం లేకున్నా సాయిరెడ్డి A2 కాబట్టి జగన్ పక్కన పెట్టుకున్నారన్నారు. సాయిరెడ్డి సొమ్ములు కొట్టేస్తున్నారని గతంలో భారతికి చెప్పానని తెలిపారు.


‘‘నేను భీమవరంకు ట్రైన్‌లో వెళ్ళేటప్పుడు, ఒక ప్రముఖ వ్యక్తి రైల్లో ప్రయాణం చేస్తున్నారని, ఆ వ్యక్తి కిషన్ రెడ్డని మా పార్టీ మానసపుత్రిక గ్రేట్ ఆంధ్రలో రాశారు.. ప్రభుత్వాలు పడిపోయేటప్పుడు ముందు పోలీసులకు తెలుస్తోంది.. కిషన్ రెడ్డి ట్రైన్ ఎక్కుతున్నారు కాబట్టి నేను అదే ట్రైన్‌లో వెళ్లొచ్చు ఇబ్బంది ఉండదు అనుకున్నాను.. ముఖ్యమంత్రి జగన్, కిషన్ రెడ్డితో మాట్లాడినట్టు గ్రేట్ ఆంధ్రాలో రాశారు.. కిషన్ రెడ్డిని ట్రైన్ దిగాలని, ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పినట్టు గ్రేట్ ఆంధ్రాలో రాశారు.. నన్ను రానివ్వకుండా ఇన్ని కుట్రలు చేశారు.. నేను ట్రైన్‌లో వెళ్తే సత్తెనపల్లిలో బోగి తగలబెట్టాలని అనుకున్నారు. అందుకే కిషన్ రెడ్డిని ట్రైన్ నుంచి దింపేశారు.’’ అని రఘురామ అన్నారు. మంత్రి రోజా అంటే తనకు గౌరవమని, పార్టీ తనకు జీవితం ఇచ్చిందని అన్నారని, పార్టీకి తాను జీతం కూడా ఇచ్చిన విషయం రోజా తెలుసుకోవాలన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానన్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రపై చర్యలు తీసుకోవాలని, ఏపీ పోలీసులతో ఆయన ఫోన్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోందన్నారు. స్టీఫెన్‌పై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానన్నారు. స్టీఫెన్‌పై డీవోపీటీకి లేఖ రాస్తానని, కోర్టులో కూడా పిటిషన్ వేస్తానని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-05T21:44:25+05:30 IST