Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏయిడెడ్ కాలేజీలపై ఏపీ ప్రభుత్వం కన్ను: రఘురామ

న్యూఢిల్లీ: ఎయిడెడ్ కాలేజీలపై ఏపీ ప్రభుత్వం కన్ను పడిందని ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ  మాట్లాడుతూ ప్రతిచోటా అప్పట్లో  దాతలు ఇచ్చిన భూములతో  ఎయిడెడ్ కళాశాలలు ఏర్పడ్డాయన్నారు. ఇప్పుడు సీఎం జగన్ అన్ని ఎయిడెడ్ కాలేజీలకు జీవో పంపారని.. ‘ఇస్తే మాకు ఇవ్వండి లేదా మీరే నడుపుకోండి’ అని అంటున్నారని ఎయిడెడ్ కాలేజీల నిర్వాహకులు చెబుతున్నారన్నారు. ప్రభుత్వం అలోచనలు దరిద్రంగా ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారన్నారు. ఏపీ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్  పెట్టి.. దాని కింద ఎయిడెడ్ కళాశాలల  ఆస్తులు చూపించి అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రఘురామ విమర్శించారు. అన్ని కళాశాలలు ఆస్తులు అమ్మితే ఇంకో లక్ష కోట్లు వస్తాయని, ఇంకో ఏడాది నడుపుకోవచ్చుని అనుకుంటున్నారన్నారు. ఇలాంటి చర్యలకు సహకరించవద్దని, లోన్లు ఇవ్వొద్దని బ్యాంకర్‌లను హెచ్చరించారు.


ఎయిడెడ్ కాలేజీల్లో చదువుకుంటున్న వాళ్ళు ముందుకు వచ్చి వాటిని నడపాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం కాస్తా జగనన్న పరిపూర్ణ మద్యపాన దీవెనగా మారిందని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం హామీ వల్ల జగన్ ముఖ్యమంత్రి అయ్యారని, కానీ ప్రజలు మద్యం తాగి చావమని సీఎం కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే కొద్ది మంది కల్తీ బ్రాండ్ల వల్ల చనిపోయారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement