గోల్ఫ్‌ టోర్నీలో నడాల్‌!

ABN , First Publish Date - 2020-10-24T09:28:47+05:30 IST

ప్రపంచ రెండో ర్యాంకర్‌ రఫెల్‌ నడాల్‌ టెన్నిస్‌ రాకెట్‌ పక్కనపెట్టి ఆటవిడుపుగా ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టోర్నీలో పాల్గొననున్నాడు

గోల్ఫ్‌ టోర్నీలో నడాల్‌!

మల్లోర్కా (స్పెయిన్‌): ప్రపంచ రెండో ర్యాంకర్‌ రఫెల్‌ నడాల్‌ టెన్నిస్‌ రాకెట్‌ పక్కనపెట్టి ఆటవిడుపుగా ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టోర్నీలో పాల్గొననున్నాడు. ఈ నెల 11న జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో వరల్డ్‌ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ను ఓడించి 34 ఏళ్ల నడాల్‌ 13వసారి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక శనివారం ప్రారంభంకానున్న బాలెరిక్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌లో నడాల్‌తో పాటు 23 మంది ప్రొఫెషనల్‌, 37 మంది ఔత్సాహిక ఆటగాళ్లు పోటీపడనున్నారు. గోల్ఫ్‌ టోర్నీలో పాల్గొనడం నడాల్‌కు ఇదే తొలిసారి కాదు. గత వారం క్లావియాలో జరిగిన వి టెస్ట్‌ సర్క్యూట్‌ టోర్నీలో రఫెల్‌ రెండో స్థానంలో నిలవడం విశేషం. 

Updated Date - 2020-10-24T09:28:47+05:30 IST