యూనిఫాం సర్వీసుల వయోపరిమితి 32 ఏళ్లకు పెంచాలి

ABN , First Publish Date - 2022-04-04T10:01:42+05:30 IST

గ్రూప్‌-1 పోస్టుల్లో యూనిఫాం సర్వీసులైన డీఎస్పీ, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌, ఫైర్‌ ఆఫీసర్ల గరిష్ఠ వయోపరిమితిని....

యూనిఫాం సర్వీసుల వయోపరిమితి 32 ఏళ్లకు పెంచాలి

  • ఆర్‌. కృష్ణయ్య

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 పోస్టుల్లో యూనిఫాం సర్వీసులైన డీఎస్పీ, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌, ఫైర్‌ ఆఫీసర్ల గరిష్ఠ వయోపరిమితిని 28 నుంచి 32 సంవత్సరాలకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఆదివారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో డీఎస్పీ, పోలీస్‌, ఫైర్‌ ఆఫీసర్‌ తదితర యూనిఫాం సర్వీసు పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32 నుంచి 40 సంవత్సరాలుగా ఉందన్నారు. తెలంగాణలో గరిష్ఠ వయోపరిమితి 28 సంవత్సరాలుగా ఉందని, గత 11 సంవత్సరాలుగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వెలువడకపోవడంతో వేలాది మంది నిరుద్యోగులకు ఆ పోటీ పరీక్షలు రాసే అవకాశం లేకుండా పోయిందన్నారు.

Updated Date - 2022-04-04T10:01:42+05:30 IST