సెబీ చీఫ్‌గా మాధబి పూరి బుచ్ బాధ్యతలు స్వీకరణ...

ABN , First Publish Date - 2022-03-03T02:20:30+05:30 IST

సెబీ(స్టాక్ ఎక్స్ఛేంజెస్ రెగ్యులేటరీ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఛీఫ్‌గా... పూరి బుచ్ బాధ్యతలను స్వీకరించారు.

సెబీ చీఫ్‌గా మాధబి పూరి బుచ్ బాధ్యతలు స్వీకరణ...

ముంబై : సెబీ(స్టాక్ ఎక్స్ఛేంజెస్ రెగ్యులేటరీ బోర్డ్ ఆఫ్ ఇండియా) చీఫ్‌గా... పూరి బుచ్ బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో... ఫైనాన్షియల్ రెగ్యులేటర్‌కు నాయకత్వం వహించిన మొదటి మహిళగా, సుదీర్ఘకాలం తర్వాత... సెబీకి నాయకత్వం వహిస్తున్న మొదటి నాన్-బ్యూరోక్రాట్‌గా నిలిచారు. సెబీ ఛీఫ్‌గా మూడేళ్ల కాలానికి ఆమె నియమితులైన విషయం తెలిసిందే. ప్రధానమైన ఫైనాన్షియల్ రెగ్యులేటర్‌కు నాయకత్వం వహించనున్న తొలి మహిళ, పనలు సంవత్సరాలలో దానికి నాయకత్వం వహించిన మొదటి నాన్-బ్యూరోక్రాట్‌గా పూరి బుచ్  ప్రత్యేకతను సాధించుకున్నట్లైంది. అజయ్ త్యాగి తన అయిదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాత క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చైర్‌పర్సన్‌గా మాధబి పూరి బుచ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.


ఐసీఐసీఐ బ్యాంక్ గ్రూప్‌లో ఎక్కువ కాలం పనిచేసిన బుచ్... అంతకుముందు గతేడాది అక్టోబరు వరకు రెగ్యులేటర్‌లో పూర్తికాల సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో సెబీతో పనిచేసిన సమయంలో మార్కెట్ నియంత్రణ విభాగం, మార్కెట్ మధ్యవర్తుల నియంత్రణ, పర్యవేక్షణ విభాగం, ఇంటిగ్రేటెడ్ నిఘా విభాగం, పెట్టుబడి నిర్వహణ విభాగం, ఆర్థిక/విధాన విశ్లేషణ విభాగాలకు చెందిన ప్రధానమైన బాధ్యతలను నిర్వర్తించారు. ఇక... షాంఘై(చైనా)లో కూడా కొంతకాలంపాటు పనిచేశారు. అధికారిక ప్రకటన ప్రకారం... ఆమె ఐసీఐసీఐ గ్రూపునకు చెుందిన బ్రోకరేజ్ విభాగం ‘ఐసీఐసీఐ సెక్యూరిటీస్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, బ్యాంక్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. బుచ్... అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి మేనేజ్‌మెంట్‌లో పట్టా పొందారు. న్యూ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల  నుండి గణితశాస్త్రంలో పట్టభద్రురాలు. 

Updated Date - 2022-03-03T02:20:30+05:30 IST