Abn logo
Jul 26 2021 @ 03:28AM

సంహితకు ఆసియా చెస్‌ టైటిల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలుగమ్మాయి పుంగవనం సంహిత ఆసియా స్కూల్స్‌ ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన ఈ ఆరేళ్ల బాలిక అండర్‌-7 విభాగంలో టైటిల్‌ కైవసం చేసుకొని శభాష్‌ అనిపించింది. ఈనెల 23 నుంచి జరుగుతున్న ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో 9 రౌండ్లు పాటు జరిగిన ఈ పోటీల్లో సంహిత 8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.