ఘొల్లుమంటున్న పుల్లాయకుంట

ABN , First Publish Date - 2022-02-15T06:16:01+05:30 IST

నగర పరిధిలో ఇప్పటికే అనే క చెరువులు, కుంటలు కబ్జాదారుల కోరల్లో చిక్కి మాయమైపో గా, తాజాగా ఆ జాబితాలో రంగశాయిపేట ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని పుల్లాయకుంట కూడా చేరింది.

ఘొల్లుమంటున్న పుల్లాయకుంట
ఆక్రమణలతో కుంచించుకుపోయిన పుల్లాయకుంట

 కబ్జాదారులకు చిక్కి మాయమవుతున్న వైనం 

కోట్లు విలువ చేసే భూమి అన్యాక్రాంతం 

ప్రముఖుల అండతో అక్రమ నిర్మాణాలు

మామునూరు, ఫిబ్రవరి 14 : నగర పరిధిలో ఇప్పటికే అనే క చెరువులు, కుంటలు కబ్జాదారుల కోరల్లో చిక్కి మాయమైపో గా, తాజాగా ఆ జాబితాలో రంగశాయిపేట ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని పుల్లాయకుంట కూడా చేరింది. ఖిలావరంగల్‌ మండలం ఉర్సు-రంగశాయిపేట రెవెన్యూ శివారులోని ఈ కుం ట కట్ట, కుంటలోపల అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, ప్రభు త్వ అధికారుల అండతో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి.  కట్టను మాయం చేసి అక్రమ కట్టడాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొందరు రియ ల్‌ వ్యాపారులు ఇతర సర్వే నంబర్లతో కాగితాలు పుట్టించి కుం టను ఆక్రమించారు. ఆ భూమిలో వివిధ రకాల వ్యాపారాలు సాగిస్తున్నారు. వరంగల్‌- ఖమ్మం జాతీయ రహదారిలో సర్వే నంబర్లు 141, 142లలో ఉన్న సుమారు 30 ఎకరాల కుంట భూమి అన్యాక్రాంతమవుతోంది. ఇక్కడ ఎకరం విలువ రూ.3 కోట్లకు పైగా పలుకుతుందని స్థానికులు చెబుతున్నారు. 

వరంగల్‌-కాజీపేట-హన్మకొండ ట్రై సిటీని కలిపే రహదారులకు ప్రధాన కేంద్రంగా ఆర్టీఏ జంక్షన్‌ ఉంది. దీంతో రియల్‌ వ్యాపారుల కన్ను పుల్లాయకుంట భూమిపై పడింది. రెండేళ్లలో రియల్‌ వ్యాపారులు అక్రమంగా కుంట కట్ట లేకుండా పూడ్చేశారు. ఆక్రమించిన 10 ఎకరాల్లో వ్యాపారులు భారీ ఎత్తున ఫ్లైవుట్‌ షాపు, ఫంక్షన్‌ హాల్‌, చికెన్‌ సెంటర్‌ కిరాణ షాపులు, బార్‌ షాపు, వాణిజ్య, వ్యాపార భవనాలు నిర్మించారు. కుంట లో మిగిలిన కొద్దిపాటి భూమిని కూడా ఆక్రమించే ప్రయత్నం లో  కొందరు నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ వ్యాపారి గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టడం విస్మయం కలిగిస్తోంది. 

1994లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పుల్లాయకుంట భూమి లో లారీ, ట్రక్‌ టెర్మినల్‌ పార్కింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మాజీ మంత్రి టి.పురుషోత్తమరావు నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. కానీ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచి పోయాయి. ఆ తర్వాత 2007లో ఇదే భూమిలో సీపీఎం ఆధ్వర్యంలో 8ఎకరాల్లో 800 మంది పేదలు గుడిసెలు వేసుకున్నారు.  రెండెక ఎకరాల విస్తీర్ణంలో శ్మశాన వాటిక ఉం ది. అధికారులు 2000లో 4 ఎకరాల్లో ఆర్టీఏ కార్యాలయం ఏర్పా టు చేశారు. అలాగే 200 ఫీట్ల రింగ్‌ రోడ్డులో 5 ఎకరాలు కలిసింది. రెండేళ్ల క్రితం ఎకరం భూమిలో విద్యుత్తు సబ్‌ష్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కుంట కట్టను  సంబంధం లేని సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ స్వాహా చేస్తున్నారు. 

ప్లాట్లు చేసిన ‘రియల్‌’ వ్యాపారి? 

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో అక్రమాలకు మారుపేరుగా ముద్రపడిన ఓ వ్యక్తి ఇక్కడ  గతంలో కట్టను ప్లాట్లుగా చేసి అమ్మినట్టు తెలిసింది. ఇతనిపైన మామునూరు పోలీసులు గతంలోనే రౌడీషీట్‌ ఓపెన్‌ చేయడం గమనార్హం. కట్ట కింద వ్యవసాయ భూమి రోడ్డు కింద పోయినప్పటికీ, దాని సర్వే నెం బర్‌తో కట్టను మొత్తం ప్లాట్లుగా చేసి విక్రయించినా అటు రెవె న్యూ, ఇటు ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. సద రు అక్రమార్కుడి నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన కొందరు.. మిగిలిన కుంటను కూడా క్రమ క్రమంగా కబ్జా చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.  ఒకప్పుడు 30 ఎకరాల్లో విస్తరించిన పుల్లాయకుంట ఇప్పుడు మొత్తం కుంచించుకుపోయిందని, కొన్ని రోజులు ఆగితే మిగిలిన కుంట కూడా కనిపించకుండా పోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  చెరువు లు, కుంటల పరిరక్షణకోసం కలెక్టర్‌ నేతృత్వంలో పనిచేసే బృం దం వెంటనే పుల్లాయకుంట ఆక్రమణలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-02-15T06:16:01+05:30 IST