ప్రజాప్రతినిధులు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-05-19T06:14:04+05:30 IST
ప్రజాప్రతినిధులు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలి
కాకతీయఖని, మే 18: కరోనా బాధితులను రక్షించుకోవడానికి రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని భ ఐఎన్‌టీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు జోగ బుచ్చయ్య డిమాండ్ చేశారు. భూపాలపల్లిలోని ఆ సంఘం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో కరోనా విళయ తాండవం చేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తుంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు లేక ఎంతోమంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారని ఆవే దన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని కరోనా బాధితులకు ఉచితంగా వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడుతున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారిని నివారించేందుకు లేఆఫ్‌ను ప్రకటించాలన్నారు. సమావేశంలో రాములు, బండి శ్రీను, అశోక్, మధూకర్‌రెడ్డి పాల్గొన్నారు.