పీఎస్‌ఎల్వీ-సీ51కి గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-02-26T08:35:33+05:30 IST

పీఎస్‌ఎల్వీ-సీ51 రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం ప్రథమ ప్రయోగ వేదికపై సిద్ధం చేసిన ఈ రాకెట్‌కు...

పీఎస్‌ఎల్వీ-సీ51కి గ్రీన్‌సిగ్నల్‌

  • వర్చువల్‌ విధానంలో ఎంఆర్‌ఆర్‌ సమావేశం 
  • రేపు ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం 
  • 28న 10.24 గంటలకు 19 ఉపగ్రహాలతో రోదసిలోకి 

శ్రీహరికోట(సూళ్లూరుపేట) ఫిబ్రవరి 25: పీఎస్‌ఎల్వీ-సీ51 రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం ప్రథమ ప్రయోగ వేదికపై సిద్ధం చేసిన ఈ రాకెట్‌కు బుధవారం ప్రయోగ రిహార్సల్స్‌ నిర్వహించారు. రిహార్సల్స్‌ విజయవంతం కావడంతో గురువారం దేశంలోని ఇస్రో సెంటర్ల నుంచి శాస్త్రవేత్తలు వర్చువల్‌ విధానంలో మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ(ఎంఆర్‌ఆర్‌) సమావేశం నిర్వహించి ప్రయోగానికి రాకెట్‌ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అనంతరం షార్‌ డైరెక్టర్‌ రాజరాజ ఆర్ముగం చైర్మన్‌గా లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 25.30 గంటల పాటు కౌంట్‌డౌన్‌ కొనసాగించిన అనంతరం ఆదివారం ఉదయం 10.24 గంటలకు 19 ఉపగ్రహాలతో పీఎ్‌సఎల్వీ-సీ51 రాకెట్‌ను రోదసిలోకి దూసుకుపోనుంది. ప్రభుత్వ రంగసంస్థ న్యూస్పేస్‌ ఇండియా వాణిజ్య ఒప్పందం మేరకు ఇస్రో తొలిసారి ఈ రాకెట్‌ ద్వారా ప్రైవేట్‌ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. బ్రెజిల్‌కు చెందిన 637 కిలోల భూపరిశీలన ఉపగ్రహం అమెజోనియ-1తో పాటు మరో 18 బుల్లి ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేయనున్నారు. ఇందులో అమెరికాకు చెందిన స్పేస్‌బీస్‌ ఉపగ్రహాలు 12, ఎస్‌ఏఐ-1 నానో కనెక్టివిటీ-2 ఉపగ్రహం, మన దేశానికి చెందిన డీఆర్‌డీవో ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన సింధునేత్ర ఉపగ్రహం ఉన్నాయి. అలాగే స్పేస్‌కిడ్జి ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన నానో ఉపగ్రహం సతీ్‌షధవన్‌శాట్‌, శ్రీపెరంబుదూరు విద్యార్థుల జేఐటీశాట్‌, నాగపూర్‌ విద్యార్థుల జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌, కోయంబత్తూరు విద్యార్థుల శ్రీశక్తిశాట్‌లను కూడా కక్ష్యల్లోకి వదిలిపెట్టనున్నారు.


Updated Date - 2021-02-26T08:35:33+05:30 IST