మమ్మల్ని రక్షించండి!.. దళారీ బాధితుల వేడుకోలు

ABN , First Publish Date - 2020-06-06T10:00:29+05:30 IST

‘మమ్మల్ని కాపాడండి బాబోయ్‌!’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులు శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. వీరంతా పెనుగొండ మండలం సిద్దాంతం గ్రామంలోని చింతలపాలెం

మమ్మల్ని రక్షించండి!.. దళారీ బాధితుల వేడుకోలు

ఏలూరు, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ‘మమ్మల్ని కాపాడండి బాబోయ్‌!’ అంటూ  పశ్చిమ గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులు శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. వీరంతా పెనుగొండ మండలం సిద్దాంతం గ్రామంలోని చింతలపాలెం వాసులు. జిల్లాలో పలు చోట్ల అధికార పార్టీకి చెందిన వారు ‘రైతులకు అదనపు మొత్తం చెల్లించాలి’ అంటూ లబ్ధిదారుల నుంచి రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారు. దీనిపై శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. మరోవైపు... ఇళ్ల స్థలాల కోసం డబ్బులు వసూలు చేసిన వారిపై ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సిద్దాంతం గ్రామానికి చెందిన గుత్తుల రమేశ్‌ తాను ఇంటి స్థలం కోసం 50 వేల రూపాయలు చెల్లించినట్లు ఫిర్యాదు చేశాడు. ఆయనపై వైసీపీ నేతలు దాడి చేసి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. శుక్రవారం సిద్దాంతం గ్రామానికి చెందిన పలువురు కలెక్టరేట్‌కు చేరుకుని తమ నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. మొత్తం 70 మంది లబ్ధ్దిదారుల పేర్లను జత చేసి ఇచ్చారు.

Updated Date - 2020-06-06T10:00:29+05:30 IST