ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం: ప్రవీణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-03-11T02:17:21+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టులు, కమిషన్‌లతో కాళేశ్వరం, దిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్‌ దుర్వినియోగం చేశారని బీఎస్‌పీ

ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం: ప్రవీణ్‌కుమార్‌

చిలుపూర్: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టులు, కమిషన్‌లతో కాళేశ్వరం, దిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్‌ దుర్వినియోగం చేశారని బీఎస్‌పీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ లో భాగంగా బీఎస్పీ ఆధ్వర్యంలో జనగామ జిల్లాలో చేపట్టిన కార్యక్రమం గురువారం (నాలుగో రోజుకు) కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులను మోసం చేయడానికే ముఖ్య మంత్రి ‘దళిత బంధు’ పథకాన్ని తీసుకువచ్చారని దుయ్యబట్టారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమయంలో ఈ పథకాన్ని టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రకటించినప్పటికి, విధివిధానాల్లో స్పష్టత కరువైందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతానని చెప్పి, బంజరు తెలంగాణగా మర్చారని ధ్వజమెత్తారు. ముందస్తు ఎన్నికల స్టంట్‌లో భాగంగానే అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ఉద్యోగాల నియామకాల ప్రకటన చేశారని తెలిపారు. ప్రకటన చేయడం కాకుండా ఎప్పటి వరకు భర్తీ చేస్తాననే విధి విధానాలను స్పష్టం చేయాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-03-11T02:17:21+05:30 IST