మంత్రి పేర్ని నానితో ముగిసిన నిర్మాతల బృందం భేటీ

ABN , First Publish Date - 2021-09-29T23:22:55+05:30 IST

మంత్రి పేర్ని నానితో ముగిసిన నిర్మాతల బృందం భేటీ అయింది. సినీ పరిశ్రమ ఆన్‌లైన్‌ టికెటింగ్‌కు అనుకూలంగా ఉందని నిర్మాతలతో పేర్ని నాని స్పష్టం చేశారు

మంత్రి పేర్ని నానితో ముగిసిన నిర్మాతల బృందం భేటీ

కృష్ణా: మంత్రి పేర్ని నానితో ముగిసిన నిర్మాతల బృందం భేటీ అయింది. సినీ పరిశ్రమ ఆన్‌లైన్‌ టికెటింగ్‌కు అనుకూలంగా ఉందని నిర్మాతలతో పేర్ని నాని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ నడుస్తోందని తెలిపారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని గుర్తుచేశారు. సినిమా టికెట్లపై నిర్దిష్ట విధానం అవసరమని పేర్ని నాని అభిప్రాయపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి తనతో మాట్లాడారని తెలిపారు. ఆడియో ఫంక్షన్‌లో జనసేన అధినేత పవన్‌ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని తెలిపారు. ఒక వ్యక్తి మాటలపై తామంతా ఏకాభిప్రాయంగా లేమని చెప్పారని పేర్కొన్నారు. ఆడియో ఫంక్షన్‌లో జరిగిన పొరపాటుతో ఇండస్ట్రీకి సంబంధం లేదన్నారని, తాము ఏకీభవించమని చిరంజీవి చెప్పారని ఆయన వెల్లడించారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని పేర్ని నాని తెలిపారు.

Updated Date - 2021-09-29T23:22:55+05:30 IST