ఏపీలో ఎడ్యుకేషనల్ హాలిడే ప్రకటించిన ప్రైవేట్ మెడికల్ కాలేజీలు

ABN , First Publish Date - 2020-05-29T20:52:34+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఎడ్యుకేషనల్ హాలిడే ప్రకటించాయి.

ఏపీలో ఎడ్యుకేషనల్ హాలిడే ప్రకటించిన ప్రైవేట్ మెడికల్ కాలేజీలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఎడ్యుకేషనల్ హాలిడే ప్రకటించాయి. ఈ మేరకు ప్రభుత్వానికి యాజమాన్యాలు లేఖ రాశాయి. ఇప్పటికే ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటా భర్తీ చేయవద్దని ప్రభుత్వానికి యాజమాన్యాలు లేఖ రాయగా.. ఇప్పుడు ఏకంగా ఎడ్యుకేషన్ హాలిడే ప్రకటించాయి. కోవిడ్-19 చికిత్స కోసం ప్రభుత్వానికి మెడికల్ కాలేజీలు కేటాయించామని లేఖలో యాజమాన్యాలు గుర్తు చేశాయి. మెడికల్ కాలేజీలు ఆర్థికంగా చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాయి.


ప్రభుత్వం నిర్ణయించిన నూతన ఫీజుల ప్రకారం కాలేజీలను నడపలేమని ప్రభుత్వానికి తెలిపాయి. గత ఏడాది కంటే కన్వీనర్ యాజమాన్యం సీటు ఫీజును ప్రభుత్వం భారీగా తగ్గించిందని యాజమాన్యాలు చెబుతున్నాయి. అన్ని కేటగిరిల్లో 70 శాతం ఫీజు కోత విధించడం దారుణమని అంటున్నాయి.

Updated Date - 2020-05-29T20:52:34+05:30 IST