ప్రవేటు అధ్యాపకులను అదుకోవాలి

ABN , First Publish Date - 2020-10-20T05:37:25+05:30 IST

ఆరు నెలలుగా వేతనాలు లేక ప్రైవేటు అధ్యాపకులు, ఉపాధ్యాయులను ఆదుకోవడంలో విఫలమైందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తాటికొండ రవికిరణ్‌ ఆరోపించారు

ప్రవేటు అధ్యాపకులను అదుకోవాలి

కలెక్టరేట్‌ ముట్టడికి బీజేవైఎం యత్నం 

అడ్డుకున్న పోలీసులు.. నాయకుల అరెస్టు


సంగెం, అక్టోబరు 19:   ఆరు నెలలుగా వేతనాలు లేక ప్రైవేటు అధ్యాపకులు, ఉపాధ్యాయులను ఆదుకోవడంలో విఫలమైందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తాటికొండ రవికిరణ్‌ ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్‌ ముట్టడించేందుకు బీజేవైఎం నాయకులు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని, పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. నేతలను బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రవికిరణ్‌ మాట్లాడుతూ పోలీసులు విచక్షణారహితంగా చితకబాదడం బాధకరమన్నారు. ఈఘటనతో ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని అన్నారు. బీజేవైఎం, బీజేపీ కార్యకర్తలపై అకారణంగా చేయి చేసుకున్న పోలీసులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎరుకల దివాకర్‌, నూనె అనిల్‌, ఉపాధ్యాక్షులు కొత్తపల్లి శ్రీకాంత్‌, దామెరుప్పుల చంద్రమౌళి, కార్యదర్శి దయ్యాల దేవరాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-20T05:37:25+05:30 IST