వ్యాక్సినేషన్‌లో రైల్వే సిబ్బందికి ప్రాధాన్యమివ్వండి

ABN , First Publish Date - 2021-05-11T09:47:26+05:30 IST

నిత్యం ప్రజల మధ్య ఉండే రైల్వే ఉద్యోగులకు కరోనా టీకా ఇవ్వడంలో ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ను సికింద్రాబాద్‌ రైల్వే అధికారులు కోరారు.

వ్యాక్సినేషన్‌లో రైల్వే సిబ్బందికి ప్రాధాన్యమివ్వండి

వినోద్‌కు రైల్వే శాఖ అధికారుల వినతి

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): నిత్యం ప్రజల మధ్య ఉండే రైల్వే ఉద్యోగులకు కరోనా టీకా ఇవ్వడంలో ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ను సికింద్రాబాద్‌ రైల్వే అధికారులు కోరారు. సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అభయ్‌కుమార్‌ గుప్తా, సికింద్రాబాద్‌ రైల్వే ఆస్పత్రి ఛీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవీంద్రశర్మ సోమవారం వినోద్‌కుమార్‌తో భేటీ అయ్యారు. సికింద్రాబాద్‌, కాజీపేట, వికారాబాద్‌లలో వైద్యపరంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. వారి వినతిని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతానని వినోద్‌కుమార్‌ హామీనిచ్చారు. 

Updated Date - 2021-05-11T09:47:26+05:30 IST