మహిళలు ఆర్ధికస్వావలంబణ సాధించాలి- సందీప్‌కుమార్‌ సుల్తానియా

ABN , First Publish Date - 2020-07-14T00:48:29+05:30 IST

స్ర్తీ నిధి, బ్యాంక్‌ లింకేజీల ద్వారా రుణాలు పొందిన స్వయం సహాయక బృందాల మహిళలు ఆర్దిక స్వావలంబన సాధించాలని రాష్ట్రపంచాయితీరాజ్‌శాఖ,గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌సుల్తానియా అన్నారు.

మహిళలు ఆర్ధికస్వావలంబణ సాధించాలి- సందీప్‌కుమార్‌ సుల్తానియా

చిట్యాల: స్ర్తీ నిధి, బ్యాంక్‌ లింకేజీల ద్వారా రుణాలు పొందిన స్వయం సహాయక బృందాల మహిళలు ఆర్దిక స్వావలంబన సాధించాలని రాష్ట్రపంచాయితీరాజ్‌శాఖ,గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌సుల్తానియా అన్నారు. సోమవారం చిట్యాల మండల కేంద్రం వెలిమినేడు గ్రామంలో స్రీ నిధి, బ్యాంక్‌ లింకేజీ రుణం పొంది వ్యాపారాలు నిర్వహించుకుంటున్న మహిళలతో ఆయన మాట్లాడారు. వెలిమినేడు గ్రామంలో ఇండియన్‌ ఫుడ్‌, బేకరీ, నాగు బండలషాపు, జగన్‌ఫుట్‌వేర్‌, పల్లె సమగ్ర సేవా కేంద్రం , రూప రెడీమేడ్‌ గార్మెంట్స్‌, లేడీస్‌ ఎంపోరియం షాపులు నిర్వహిస్తున్న మహిళలతో మాట్లాడి రుణం పొందిన తీరు, వ్యాపారం ఎలా సాగుతోంది, ఎంత ఆదాయం వస్తోందన్నవిషయాలను అడిగి తెలుసుకున్నారు. స్ర్తీ నిధి ద్వారా రుణ సహాయంతో తమ వ్యాపారం అభివృద్ధి చేసుకుంటున్నట్టు , కుటుంబం, పిల్లల పోషణ చేసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ట్రైనీ ప్రతిమాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-14T00:48:29+05:30 IST