సిద్దిపేట జిల్లాకు ప్రధాన మంత్రి అవార్డు

ABN , First Publish Date - 2022-04-13T07:50:43+05:30 IST

సిద్దిపేట జిల్లాకు మరో అరుదైన గౌరవం దక్కింది. చిన్నారులకు

సిద్దిపేట జిల్లాకు ప్రధాన మంత్రి అవార్డు

  •  పిల్లలకు వంద శాతం టీకాలు వేసి రికార్డు..
  • హరీశ్‌రావు హర్షం


హైదరాబాద్‌/సిద్దిపేట టౌన్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లాకు మరో అరుదైన గౌరవం దక్కింది. చిన్నారులకు వంద శాతం టీకాలు వేసినందుకుగాను ప్రధాన మంత్రి అవార్డు-2019కు ఎంపికైంది. చిన్నారులకు వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలనే లక్ష్యంలో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద మిషన్‌ ఇంద్ర ధను్‌షను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం అమలులో సిద్దిపేట జిల్లా సత్తా చాటింది.


టీకాలు వేసుకోలేని చిన్నారులను గుర్తించి, వారందరికీ వ్యాక్సి న్లు పంపిణీ చేయడంలో అధికారులు, సిబ్బంది మంచి ఫలితాలు సాధించారు. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మిషన్‌ ఇంద్ర ధనుష్‌ కేటగిరీలో సిద్దిపేట జిల్లాను ప్రధాన మంత్రి అవార్డుకు ఎంపిక చేసింది. ఏప్రిల్‌ 20-21న ఢిల్లీలో జరిగే ‘సివిల్‌ సర్వీసెస్‌ డే’ లో అవార్డుతో పాటు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభు త్వం అందిస్తుంది. సిద్దిపేట జిల్లాకు ఈ అవార్డు రావడం పట్ల మంత్రి హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-04-13T07:50:43+05:30 IST