14 వరకూ స్థిరంగా ‘ఆక్వా’ ధరలు

ABN , First Publish Date - 2020-03-29T09:02:51+05:30 IST

ఆక్వా ఉత్పత్తుల ధరలు ఏప్రిల్‌ 14 వరకు స్థిరంగా ఉండేలా సీఎం జగన్‌ చర్యలు తీసుకున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు...

14 వరకూ  స్థిరంగా ‘ఆక్వా’ ధరలు

  • 30-100 కౌంట్‌ వరకు రొయ్యల ధర నిర్ణయం
  • దళారులు, వ్యాపారులపై క్రిమినల్‌ చర్యలు
  • దుకాణాల లైసెన్సులు రద్దు: మంత్రి మోపిదేవి 

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఆక్వా ఉత్పత్తుల ధరలు ఏప్రిల్‌ 14 వరకు స్థిరంగా ఉండేలా సీఎం జగన్‌ చర్యలు తీసుకున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు చెప్పారు. రొయ్యల రైతులు నష్టపోకుండా స్థిరమైన ధర నిర్ణయించామన్నారు. ఆక్వా ఎగుమతిదారులు, మత్సశాఖ అధికారులతో మంత్రి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా ప్రభావం వల్ల ఆక్వా, పౌలీ్ట్ర రంగాలు కొంత ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. అయితే వైరస్‌ వల్ల ఆక్వారంగ పరిశ్రమలు మూతపడతాయని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కరోనాతో సంబంధం లేకుండా ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు. 30-100 కౌంట్‌ వరకు రొయ్యల ధర నిర్ణయించామన్నారు. 30 కౌంట్‌ కిలో రొయ్యల ధర రూ.430, 40కౌంట్‌ ధర రూ.310, 50 కౌంట్‌ ధర రూ.260, 60 కౌంట్‌ ధర రూ.240, 70 కౌంట్‌ ధర రూ.220, 80కౌంట్‌ ధర రూ.200, 90కౌంట్‌ ధర రూ.190, 100కౌంట్‌ కేజీ రొయ్యల ధర రూ.180గా నిర్ణయించామన్నారు. మార్కెట్‌ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఇలా ముందే స్థిరమైన ధరలు నిర్ణయించడం దేశంలోనే మొదటిసారని చెప్పారు. కరోనాతో సంబంధం లేకుండా పండించిన పంటను ఏ ప్రాంతంలో అయినా కొనుగోలు చేయడానికి ఆక్వా ఎగుమతిదారులు ముందుకు రావడం స్వాగతించాల్సిన విషయమన్నారు. దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని మంత్రి సూచించారు. రైతులకు నష్టం కలిగించే దళారులు, వ్యాపారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడంతో పాటు దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నోడల్‌ ఏజెన్సీగా ఉన్న ఎంపెడాకు అధికారాలు ఇస్తున్నామన్నారు. ఆక్వా ఉత్పత్తులు సీడ్‌, ఫీడ్‌కు సంబంధించిన రవాణాలో ఎలాంటి అడ్డంకులు ఉండబోవన్నారు.


ఈ విషయంలో పోలీస్‌, రెవెన్యూ, వలంటీర్లు సహకరించాలన్నారు. మత్య్స ఉత్పత్తులకు సంబంధించి ఎక్స్‌పోట్‌ ఇన్‌స్పెక్షన్‌  అథారిటీ(ఈఐఏ) నుంచి క్లియరెన్సు సర్టిఫికెట్లు త్వరగా ఇప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రతి జిల్లాకు మత్యశాఖకు చెందిన జాయింట్‌ డైరెక్టర్‌ను నోడల్‌ ఆఫీసరుగా నియమిస్తున్నామని, ఏ ఇబ్బందులు ఉన్నా వీరితో సమన్వయం చేసుకోవాలన్నారు. పౌలీ్ట్రరంగం కుదేలవకుండా గుడ్లు, చికెన్‌  మార్కెట్‌లో అమ్ముకునేందుకు, రవాణాకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉదయం 6నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పని చేస్తాయన్నారు. సీఎం సహాయ నిధికి పౌలీ్ట్ర రంగం రూ.60లక్షలు విరాళం అందజేసినట్లు మంత్రి పేర్కొన్నారు.


సీఎం సహాయనిధికి ఫౌల్ట్రీ ఫెడరేషన్‌

రూ.50 లక్షల విరాళం

బిక్కవోలు, మార్చి 28: కోవిడ్‌-19 నిర్మూలన, సహాయచర్యల నిమిత్తం నాలుగు జిల్లాల ఫౌలీ్ట్ర ఫెడరేషన్లు సీఎం సహాయనిధికి రూ.50 లక్షలు అందజేశాయి. తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఈ మేరకు చెక్కును జిల్లా నెక్‌ చైర్మన్‌ కర్రి వెంకటముకుందరెడ్డి శనివారం విజయవాడలో అందజేశారు. ఆయ న వెంట ఏపీ ఫౌలీ్ట్ర ఫెడరేషన్‌ సెక్రటరీ పడాల సుబ్బారెడ్డి, విశాఖ జిల్లా చైర్మన్‌ భాస్కర్‌, పశ్చిమగోదావరి చైర్మన్‌ గంగాధర్‌, కృష్ణా చైర్మన్‌ కుటుంబరావు ఉన్నారు.

Updated Date - 2020-03-29T09:02:51+05:30 IST